Sunday, December 22, 2024

మోడీ యుగ పురుషుడు, మరో గాంధీ: ధన్‌కర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ ః జాతిపిత మహాత్మా గాంధీకి, ప్రధాని మోడీకి పలు సారూప్యాలు ఉన్నాయని ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ పేర్కొన్నారు. గాంధీజి మహాపురుషుడు అయితే , మోదీజీ యుగపురుషుడు అని ఇక్కడ జరిగిన జైనుల ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీరికి పోలికలు తెలిపారు. మహాత్మా గాంధీ దేశాన్ని బ్రిటిష్ వారి దాస్యం నుంచి గట్టెక్కించారు. కాగా ప్రధాని మోడీ దేశాన్ని ఆర్థిక ప్రగతి పథంలోకి మళ్లించారని కొనియాడారు. ఉప రాష్ట్రపతి హోదాలో ధన్‌కర్ ఈ విధంగా మాట్లాడటం అనుచితం అని కాంగ్రెస్ స్పందించింది. గాంధీజితో మోడీని పోల్చడం సిగ్గుచేటు అని పార్టీ విమర్శించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News