- Advertisement -
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్ముకశ్మీర్ నేతలతో మోడీ భేటీ కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన అంశంతోపాటు అసెంబ్లీ ఎలక్షన్ పై చర్చించనున్నట్లు సమాచారం. దీంతో జమ్మూకశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడంపై కూడా చర్చించనున్నట్లు తెలస్తోంది. ఈ సమావేశానికి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఫరుక్ అబ్దుల్లాతోపాటు కాంగ్రెస్, బిజెపి, ఇతర రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు 48 గంటలపాటు హై అలర్ట్ విధించారు.
PM Modi’s All Party meet in Delhi
- Advertisement -