బురదలో కూరుకుపోయిన మోడీ హెలికాప్టర్
డికె శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఢీకొన్న పక్షి
రాయ్‌చూర్: ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కర్ణాటకలోని సింధనూర్‌లో బురదలో కూరుకుపోయింది. మంగళవారం భారీ వర్షాల కారణంగా కొంత సమయం చాపర్ బురదలో ఇరుక్కుపోయినట్లు అధికారులు తెలిపారు. అనంతరం హెలికాప్టర్‌ను బురద నుంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. సింధనూరు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి వెళ్లేందుకు మోడీ హెలికాప్టర్‌లో కూర్చోగా అయ్యేందుకు మొరాయించింది. హెలికాప్టర్ బురదలో కూరుకుపోవడంతో అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
కాగా ఉదయం కెపిసిసి చీఫ్ డికె శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. కాక్‌పిట్‌లోని అద్దాన్ని ఢీకొనడంతో హెలికాప్టర్‌ను అత్యవసరంగా హెచ్‌ఎఎల్ ఎయిర్‌పోర్టులో దింపిసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హెలికాప్టర్‌లో ఉన్న శివకుమార్, కన్నడ న్యూస్ చానల్ విలేఖరి, సిబ్బంది, ఇతరులకు ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.
Also Read: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, జెడి(ఎస్): ప్రధాని మోడీ