Sunday, September 22, 2024

లాక్‌డౌన్ ఎత్తివేతపై ఏంచేద్దాం?

- Advertisement -
- Advertisement -
PM Modi

 

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేదెలా
కీలక వ్యూహాలపై నేడు మరోసారి రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ ఐదో వీడియో కాన్ఫరెన్స్
రెండు దఫాలుగా సమావేశం
సిఎంలందరికీ మాట్లాడే ఛాన్స్, పాల్గొననున్న ముగ్గురు కేంద్రమంత్రులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికోసం దేశవ్యాప్తంగా పొడిగించిన లాక్‌డౌన్ 3.0 ముగింపు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ మరో సారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు.

సోమవారం (11వ తేదీ) మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా సమావేశం కానున్నారని ప్రధానమంత్రి కార్యాలయం( పిఎంఓ) ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ సమావేశంలో కేంద్ర హోం, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. గత స మావేశంలో ప్రధాని, హోంమంత్రి మాత్రమే పాల్గొన్నారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం ఇది అయిదో సారి. కాగా ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ రెండు సెషన్స్‌గా జరగనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలనుంచి 5.30 గంటల వరకు తొలి సెషన్, ఆ తర్వాత అరగంట విరామం తీసుకొని 6 గంటలనుంచి రెండో సెషన్ జరగవచ్చని సమాచారం.

ముఖ్యమంత్రులందరూ మాట్లాడేవరకు వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతుందని అంటున్నారు. లాక్‌డౌన్‌నుంచి వైదొలిగే అంశం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సిఎంలతో ప్రధాని సమాలోచనలు జరపనున్నారు. గత సమావేశంలో కేవలం 9 మంది ముఖ్యమంత్రులకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించగా, ఈ సారి మాత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడనున్నారు. మరో వైపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదివారం ఉదయం మాట్లాడారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాలనుంచి వలస కార్మికుల రాకతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వారు ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా జిల్లాలో రెడ్‌జోన్లుగా మారుతున్నాయని చెప్పినట్లు సమాచారం. ఇలాగైతే సాధారణ స్థితికి చేరుకోవడం కష్టమవుతుందన్న వారినుంచి వ్యక్తమయినట్లు సమాచారం. దీంతో ఇదే అంశం సోమవారం ముఖ్యమంత్రుల సమావేశంలోనూ చర్చకు రావచ్చని తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News