పాకిస్థాన్ గగనతలం మీదుగా
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన దశలో ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం పాకిస్థాన్ గగనతలం మీదుగా ఎక్కడా ఆగకుండా వెళ్లింది. కల్లోల అఫ్ఘనిస్థాన్ మీదుగా వెళ్లకుండా ఉండేందుకు పాకిస్థాన్ మార్గాన్ని ఎంచుకున్నారు. దీనికి సంబంధించి భారతీయ ఉన్నతాధికారులు పాకిస్థాన్‌ను అనుమతికి అభ్యర్థించారు. దీనికి స్పందించిన పాకిస్థాన్ ప్రధాని మోడీ ప్రత్యేక విమానం పాకిస్థాన్ గుండా వెళ్లేందుకు అనుమతించింది. జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు ఇతర పరిణామాల నేపథ్యంలో ఇటీవలి కాలంలో భారతదేశపు విమానాల రాకపోకలకు పాకిస్థాన్ అనుమతి నిరాకరిస్తూ వస్తోంది. గత ఏడాది భారత రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ విమాన ప్రయాణాలకు సమ్మతించలేదు. సాధారణంగా అమెరికాకు ఇతర దేశాలకు విమాన ప్రయాణాలు అఫ్ఘనిస్థాన్ మీదుగా జరుగుతాయి. అయితే ఇప్పటి అక్కడి పరిస్థితి నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన మార్గం మార్చారు.