Tuesday, November 5, 2024

జాతీయ జెండాలను పంచిన ప్రధాని మోడీ మాతృమూర్తి..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ శనివారం జాతీయ జెండాలను పంచిపెట్టారు. ఈ ఏడాది జూన్‌లో ఆమె 100వ వసంతంలోకి స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని గుజరాత్ గాంధీనగర్ శివార్లలోని నివాసం వద్ద హీరాబెన్ పిల్లలకు జాతీయ జెండాలను అందజేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హీరాబెన్ తమ నివాసప్రాంతంలోని పిల్లలకు మువ్వన్నెల పతాకాలను ఎగురవేసి వారితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీ తమ్ముడు పంకజ్‌మోడీతో కలిసి ఆమె నివసిస్తున్నారు.కాగా గుజరాత్‌వ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించిన బిజెపి ఎమ్మెల్యేలు, మంత్రులు జాతీయ ర్యాలీలు నిర్వహించారు. వడోదర్ బిజెపి ఎంపి రంజన్‌భట్ జాతీయజెండా చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ 75వ సందర్భంగా సిఎం భూపేంద్ర పటేల్ రాజధానిలో 100అడుగుల పొడవు జాతీయజెండాను శనివారం పిల్లల యూనివర్సిటీలో ఎగురవేశారు.

PM Modi’s Mother Heeraben distributes National Flags

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News