Monday, December 23, 2024

పిఎం మోడీకి మాతృవియోగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్(100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఆమెను  యుఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతూ హీరాబెన్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె వందో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. గాంధీనగర్ కు సమీపంలోని రయ్సాన్ గ్రామంలో పిఎం నరేంద్ర మోడీ సోదరుడు పంకజ్ మోడీతో కలిసి హీరాబెన్ ఉంటున్నారు. గుజరాత్ పర్యటనకు వచ్చినప్పుడు పిఎం మోడీ తన తల్లిని కలుసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి ఆరోగ్యంగా తిరిగి రావాలని ధర్మయాత్ర మహాసంఘ్ కార్యకర్తలు ఓ దేవాలయంలో మహా మృత్యుంజయ మంత్రం జరిపించారు. భద్రినాథ్, కేదార్ నాథ్ దేవాలయంలో హీరాబెన్ త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News