Monday, December 23, 2024

మోడీ జవాబుతో మురిశా

- Advertisement -
- Advertisement -

PM Modi's reply to Dehradun student

మెరిసిన డెహ్రాడూన్ విద్యార్థి

డెహ్రాడూన్ : దేశ ప్రధాని మోడీ డెహ్రాడూన్ స్కూల్ విద్యార్థి అనురాగ్ రమోలాకు తిరుగు సమాధానంతో లేఖ రాసి మనసు గెల్చుకున్నారు. ప్రధాని అంతటి వారు తన లేఖలకు తాను వేసిన చిత్రాలకు స్పందించి తిరుగు జవాబు ఇవ్వడం తనకు అమితానందం కల్గించిందని రమోలా తెలిపారు. ప్రధాని మోడీ జాతీయ స్థాయి అంశాలపై స్పందించిన తీరు, తన వంటి యువ విద్యార్థులతో ఎప్పుడూ ఇష్టాగోష్టిగా మాట్లాడటం, పరీక్షల సమయంలో తగు సలహాలు ఇవ్వడం వంటివి తనను ఆకట్టుకున్నాయని రమోలా తెలిపారు. దేశానికి స్వాతంత్ర అమృతోత్సవం ఇతివృత్తంగా తాను వేసిన పెయింటింగ్స్‌ను ప్రధానికి పంపించానని చెప్పారు.

అయితే అటు నుంచి తిరుగు సమాధానం వస్తుందని తాను ఊహించలేదని , పైగా తనను చిన్ననాటనే జాతీయ ప్రయోజన అంశాలపై స్పందిస్తున్నావని అభినందించారని హర్షం వ్యక్తం చేశారు. యువతరం పటిష్ట సౌభాగ్య భారతదేశం నిర్మాణం దిశలో గణనీయ పాత్ర పోషిస్తోందని కూడా ప్రధాని కితాబు ఇచ్చారు. విద్యార్థి అనురాగ్ జీవితంలో ఎదగాలని, కీలక అంశాలపై నిర్మాణాత్మక పాత్రను కొనసాగిస్తూ విజయం సాధించాలని ఆశీర్వదించారు. అంతేకాకుండా గత ఏడాది కేటగిరి పరిధిలో మోడీ ఈ బాలుడికి రాష్ట్రీయ బాల పురస్కారం అందించారు. తన లేఖ ప్రధాని చదివితే చాలుననుకున్నానని, అయితే ఈ విధమైన స్పందన తనకు అమితానందం కల్గించిందని అనురాగ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News