ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీల కష్టాలు మంగళవారంతో ముగిశాయి. ఈ ఏడాది నవంబర్ 12న దీపావళి పండుగ రోజు ఉదయం ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో భవన నిర్మాణ కార్మికులు చిక్కుకుపోయారు. అయితే, నవంబర్ 28న, అనేక అవాంతరాలను అధిగమించిన సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత చిక్కుకున్న కార్మికులందరూ బయటపడ్డారు. ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న ప్రతి కూలీలతోనూ ప్రధాని నరేంద్ర మాడీ ఫోన్‌లో మాట్లాడారు.
సిల్క్యారా టన్నెల్ ఆపరేషన్‌లో పాల్గొన్న రక్షకుల ధైర్యాన్ని, దృఢ సంకల్పాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. దేవుని ఆశీస్సులు, వారి కుటుంబ సభ్యులు చేసుకున్న పుణ్యమే వారిని కాపాడిందన్న ఆయన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎంతో కష్టం తర్వాత కూడా మీరు బయటపడ్డారు. నాకైతే చాలా సంతోషకరమైన విషయం మాటల్లో చెప్పలేనని వెల్లడించారు.
#WATCH | Prime Minister Narendra Modi's telephonic conversation with the workers who were successfully rescued from Uttarakhand's Silkyara tunnel after 17 days pic.twitter.com/G1q26t5Ke8
— ANI (@ANI) November 29, 2023