Wednesday, November 20, 2024

వ్యాక్సినేషన్‌లో నూతన చరిత్ర

- Advertisement -
- Advertisement -

PM Narendra Modi at RML Hospital

ప్రధాని మోడీ గురువారం నాడు న్యూఢిల్లీ రాం మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడ వైద్య సిబ్బందిని ఆశీర్వదిస్తున్న దృశ్యం
100 కోట్ల డోసుల మైలురాయి దాటినందుకు డబ్లూహెచ్‌ఒ అభినందనలు
ప్రత్యేక గీతం విడుదల, ఎర్రకోటపై భారీ మువ్వన్నెల జెండా మువ్వన్నెల వెలుగుల్లో వంద పురాతన చారిత్రక కట్టడాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్ చేపట్టిన టీకా కార్యక్రమం గురువారం 100 కోట్ల మైలురాయిని దాటి అరుదైన ఘనతను సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ సరికొత్త చరిత్రను లిఖించాం. 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తి, భారతీయ సైన్స్, ఎంటర్‌ప్రైజ్ విజయాన్ని నేడు మనం చూస్తున్నాం. టీకా పంపిణీలో 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈలక్షాన్ని చేరుకునేందుకు కృషి చేసిన మన వైద్యులు,నర్సులు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. టీకా పంపిణీలో 100 కోట్ల మైలు రాయిని దాటిన సందర్భంగా గురువారం ఉదయం ప్రధాని మోడీ ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించారు.అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ప్రధాని వెంట కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కూడా ఉన్నారు. ఈ చారిత్రక మైలు రాయిని చేరుకున్న సందర్భంగా మన్‌సుఖ్ మాండవీయ దేశ ప్రజలను అభినందించారు. దూరదృష్టి కలిగి న ప్రధాని నాయకత్వం వల్లనే ఇ ది సాధ్యమైందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందన

కొవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీలో 100 కోట్ల మైలురాయిని చేరుకున్నందుకు భారత్‌ను ప్రపంచ ఆరో గ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ) అభినందించింది. ‘ కొ విడ్ మహమ్మారి ముప్పు ఉన్న ప్రజలను రక్షించడంతో పాటుగా వ్యాక్సిన్ సమానత్వ లక్షాలను సాధించేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలకు భార త ప్రధాని , శాస్త్రవేత్తలు, వైద్య, ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజలకు అభినందనలు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసెస్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా 100 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌కు టెడ్రోస్ స్పందించారు. ‘ 100 కోట్ల కొవిడ్19 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి మరో కీలక మైలురాయిని చేరుకున్న భారత్‌కు అభినందనలు. బలమైన నా యకత్వం, వివిధ రంగాల మధ్య సమన్వయం, ఆరోగ్య కార్యకర్తలతో పాటుగా వైద్య ఆరోగ్య వ్యవస్థ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంలేకుండా తక్కువ సమయంలో ఇంతటి అసాధారణ ఘనతను సాధించడం సాధ్యం కాదు. భారత్ సాధించిన ఈ పురోగతి కేవలం వ్యాక్సిన్ పంపిణీలో నిబద్ధతనే కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడే ఈ వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు అందుబాటులో ఉండేలా చూసే ప్రయత్నాల కోణంలో చూడాలి’ అని డబ్లుహెచ్‌ఒ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు.

సీరం , భారత్ బయోటెక్ హర్షం

భారత్‌లో 100 కోట్ల కొవిడ్19 వ్యాక్సిన్ డోసులను విజయవంతంగా పంపిణీ చేయడంపై సీరం ఇన్‌స్టిటూట్ సిఇఓ అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. మీ నాయకత్వంలోఈ రోజు భార త్ ఈ ఘనతను సాధించిందని ప్రధాని అ భినందనలు తెలియజేశారు. కాగా కేవలం తొమ్మి ది నెలల కాలంలోనే భారత్ ఈ అసాధారణ ఘన త సాధించడం పట్ల భారత్ బయోటెక్ సంతోషం వ్యక్తం చేసింది. ‘ఈ చారిత్రక కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉంది. కేంద్రంతో పాటు వ్యాక్సిన్ తయారీ సంస్థలు, ఆరో గ్య కార్యకర్తలు, దేశ పౌరుల సహకారంతోనే ఆ త్మ నిర్భరతలో భారత్ విజయం సాధించింది’ అ ని భారత్ బయోటెక్ సిఎండి డా. కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.

ప్రత్యేక కార్యక్రమాలు

100 కోట్ల డోసుల రికార్డును భారత్ ఘనంగా జరుపుకొంటోంది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ అపురూప ఘట్టానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఆడియో విజువల్ పాటను విడుదల చేశారు. ‘ టీకాసే బచే హై దేశ్’ పేరుతో రూపొందించిన ఈ గీతాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత కైలాష్ ఖేర్ ఆలపించారు. కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా ఈ గీతాన్ని పంచుకున్నారు. ఎర్రకోటపై దాదాపు 1400 కిలోల బరువుండే భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పురావస్తు శాఖ కూడా ఈ ఆనందంలో పాలు పంచుకుటోంది. 100 కోట్ల డోసుల కు సూచనగా దేశవ్యాప్తంగా 100 పురావస్తు కట్టడాలను జాతీయ పతాక వర్ణాల వెలుగుల్లో నింపేయాలని నిర్ణయించింది. జాతీయ జెండా రంగు లు విరజిమ్మే కట్టడాల జాబితాలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన 17 కట్టడాలున్నాయి.

ఎర్రకోట, కుతుబ్ మీనార్, హుమయూన్ టోంబ్, పురానా ఖిలా, ఫతేపూర్ సిక్రీ, రామప్ప ఆలయం, హంపిలతో పాటుగా హైదరాబాద్‌లోని గోల్కొండ కోటపై కూడా ఈ రంగులు ప్రదర్శించనున్నారు. 100 కోట్ల వ్యాక్సిన్ మైలురాయిని స్మరించుకునేందుకు స్పైస్ జెట్ గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రత్యేక లైవరీని ప్రదర్శించింది. తమ సంస్థకు చెందిన మూడు బోయింగ్ 737 విమానాలను ప్రధాని మోడీతో పాటుగా ఆరోగ్య కార్యకర్తల చిత్రాలతో అలంకరించారు. కేంద్ర మంత్రు లు జ్యోతిరాదిత్య సింధియా, మన్‌సుఖ్ మంఆడవీయలతో పాటుగా స్పైస్‌జెట్ సిఎండి అఃవ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కాకుండా కొన్ని మొడైల్ సంస్థలు 100 కోట్ల డోసుల మైలురాయిని పూర్తి చేసుకోవడాన్ని ప్రస్తావించే కాలర్ ట్యూన్లను కూడా ప్రవేశపెట్టాయి. వివిధ రాష్ట్రాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News