కీవ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఉదయం 7.30 గంటలకు ఉక్రెయిన్ చేరుకున్నారు. పోలాండ్ నుంచి ఆయన రైలులో కీవ్ చేరుకున్నారు. పోలాండ్ లో గురువారం పర్యటన ముగించుకున్న మోడీ రైలు మార్గం ద్వారా ఉక్రెయిన్ చేరుకున్నారు. భారత్ శాంతికి మాత్రమే వారధిగా నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన పర్యటన వివరాలను భద్రత పరంగా గోప్యంగా ఉంచారు. కాగా కీవ్ లో భారత సంతతి ప్రజలు ఆయనకు జెండా ఊపుతూ స్వాగతం పలికారు. తదుపరి మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ కానున్నారు. 1991లో సోవియట్ నుంచి విడిపోయిన ఉక్రెయిన్ ను మోడీ సందర్శించడం ఇదే తొలిసారి. జెలెన్ స్కీ ఆహ్వానించినందునే మోడీ ఉక్రెయిన్ పర్యటిస్తున్నారు.
Reached Kyiv earlier this morning. The Indian community accorded a very warm welcome. pic.twitter.com/oYEV71BTlv
— Narendra Modi (@narendramodi) August 23, 2024