‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ ప్రసంగం.. తెలంగాణ చేనేతలపై ప్రశంసలు
న్యూఢిల్లీ: జీ-20 కూటమికి నేతృత్వం.. భారత్ కు దక్కిన గౌరవమని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం ప్రధాని మన్ కీ బాత్ లో ప్రసంగించారు. జీ-20 కూటమిలో భారత్ పాత్ర ఎంతో కీలకం కానుందన్నారు. జీ-20 దేశాలతో వ్యాపార సంబంధాలున్న రాష్ట్రాలతో చర్చిస్తామని ప్రధాని పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో మరిన్ని విజయాలు సాధిస్తామని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లోని కినోర్ లో డ్రోన్ల ద్వారా యాపిల్స్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.
యువత సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రధాని మోడీ చెప్పారు. ఇండియన్ మ్యూజిక్ గ్రంథానికి ప్రపంచవ్యాప్తంగా మంచిపేరు వచ్చిందన్నారు. భారతీయ సంగీత పరికరాలు అనేక దేశాల్లో విక్రయిస్తున్నారని ఆయన వివరించారు. సిరిసిల్లా జిల్లాకు చెందిన హిరిప్రసాద్ తనకు లేఖ పంపారని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. చేనేత పరిశ్రమ గురించి హరిప్రసాద్ అనేక సూచనలు చేశారని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణ చేనేతలపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. సిరిసిల్ల నేతన్న జీ-20లోగో పంపారని తెలిపారు. అద్భుతమైన బహుమతిని చూసి ఆశ్చర్యపోయానని ప్రధాని చెప్పారు.