Sunday, September 8, 2024

కరోనా టీకాలపై భయాందోళనలు వద్దు : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

pm narendra modi mann ki baat today

మన్‌కీబాత్‌లో ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి
అమ్మకు వందేళ్లున్నా రెండు టీకాలు వేసుకున్నారు.

న్యూఢిల్లీ : కరోనా టీకాలు తీసుకోవడంలో అనుమానాలు, భయాందోళనలు విడిచిపెట్టాలని, ప్రధాని నరేంద్రమోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతోందని, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనాపై ప్రజల పోరాటం సమష్టిగా సాగుతోందని, ఈ పోరాటంలో మనం ఓ అసాధారణ విజయం సాధించామని, జూన్ 21న 86 లక్షల మందికి పైగా ఉచిత టీకా తీసుకున్నారని, ఒక రోజులో ఇంత ఎక్కువ మంది టీకా తీసుకోవడం గొప్ప రికార్డు అని ప్రధాని అభివర్ణించారు. ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీబాత్ రేడియో కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. మధ్యప్రదేశ్ లోని బేటుల్ జిల్లా దులేరియా గ్రామస్థులతో మోడీ మాట్లాడారు. వ్యాక్సిన్లపై లేనిపోని అనుమానాలను తమ గ్రామంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆ గ్రామస్థులు మోడీకి తెలియచేశారు.

దీనిపై స్పందించిన మోడీ అలాంటి వదంతులను నమ్మ వద్దని, వారికి నచ్చ చెప్పారు. తాను టీకా రెండు డోసులు తీసుకున్నానని, సుమారు వందేళ్ల వయసున్న తన తల్లి కూడా రెండు డోసులు తీసుకున్నారని వెల్లడించారు. మీరందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. శాస్త్రవిజ్ఞానాన్ని నమ్మండి. శాస్త్రవేత్తలను విశ్వసించండి. ఇప్పటికే అనేక మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకాలపై వస్తున్న వదంతులను నమ్మవద్దు అని ఆయన ప్రజలను కోరారు. నూటికి నూరు శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్న గ్రామాలు మన దేశంలో చాలా ఉన్నాయని, కొవిడ్ ముప్పు ఇంకా పొంచి ఉందని, ప్రజలు వ్యాక్సిన్ పైనా, కరోనా నిరోధక నిబంధనలు పాటించడం పైనా దృష్టి కేంద్రీకరించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News