Monday, December 23, 2024

చీతాలను విడుదల చేసిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Narendra Modi releases cheetahs

భోపాల్ : అరుదైన వన్యప్రాణులైన చీతాలు (చిరుతపులుల్లో ఒక రకం) దాదాపు 74 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాయి. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్‌లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. నమీబియా లోని విండ్‌హాక్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ 17 హెలికాప్టర్లలో కునే నేషనల్ పార్కుకు వీటిని శనివారం ఉదయం తీసుకొచ్చారు. ఈ 8 చీతాలను మోడీ ప్రత్యేక క్వారంటైన్ ఎన్‌క్లోజర్ లోకి విడుదల చేశారు. అనంతరం మోడీయే స్వయంగా కెమెరా చేతపట్టి వాటి ఫోటపోలు తీశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. ప్రధాని మోడీ పుట్టిన రోజునే ఈ ప్రాజెక్టును ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఈ ఎనిమిది చిరుతలు మన అతిధులని, కునో నేషనల్ పార్కు వీటి ఇల్లని, వీటిని తీసుకురాడానికి ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి కృషి చేస్తోందని చెప్పారు. దీని వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకొంటున్న సమయంలో వీటిని తీసుకువచ్చామని, నూతన శక్తితో వీటిని పరిరక్షిస్తామన్నారు. ఇది చరిత్రాత్మక దినమని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News