Monday, January 6, 2025

ఉక్రెయిన్ సంక్షోభంపై విపక్షాల రాజకీయాలు : మోడీ ధ్వజం

- Advertisement -
- Advertisement -

PM Narendra Modi Slams Opposition Over Ukraine Crisis

లక్నో : ఉక్రెయిన్ సంక్షోభం పైనా విపక్షాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ప్రజల బాధలపై వారికి ఎలాంటి పట్టింపూ లేదని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. సుదీర్ఘంగా సాగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టంలో చివరి విడత పోలింగ్ ఈనెల 7 న జరుగుతుండటంలో ప్రధాని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో శనివారం విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఖజురి గ్రామం లో ర్యాలీలో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రభుత్వ అనుకూల పవనాలు ఉన్నాయని , ప్రభుత్వాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ప్రజలు ఉన్నారని తెలిపారు. తన పట్ల వ్యతిరేకత కారణం గానే కుటుంబ పాలకులు వోకల్ ఫర్ లోకల్ , స్వచ్ఛభారత్ అభియాన్‌పై ఛలోక్తులు వేస్తున్నారని విమర్శించారు. ఖాదీ వాడకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పేరు ఎత్తడానికి కూడా వెనుకాడుతోందని వ్యాఖ్యానించారు. ఖాదీ, యోగాను అంతర్జాతీయ బ్రాండ్‌లుగా తీర్చి దిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈనెల 7న చివరి విడత పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో వారణాసి కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News