- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలోకి ఒమిక్రాన్ ప్రవేశించి విస్తరిస్తున్న నేపథ్యంలో గురువారం ప్రధాని నరేంద్రమోడీ తాజా పరిస్థితిపై సమీక్షించనున్నారని అధికారవర్గాలు తెలిపాయి. కరోనా మహమ్మారి ఉనికిలోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రధాని ఇప్పటికే పలుమార్లు ఆరోగ్యశాఖ అధికారులు,ముఖ్యమంత్రులు, నిపుణులతో సమీక్షలు నిర్వహించారు. చివరిసారిగా అధికారులతో నవంబర్ చివరి వారంలో సమీక్షించారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఇప్పటికే 200 దాటింది. 15 రాష్ట్రాలకు ఇది విస్తరించింది. డెల్టా వేరియంట్‌కన్నా మూడురెట్లు అధికంగా ఇది వ్యాప్తి చెందుతున్నదన్న నిపుణుల విశ్లేషణతో కేంద్రం అప్రమత్తమైంది. వ్యాప్తిని అడ్డుకునేందుకు నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్షించేందుకు వార్‌రూంలను ఏర్పాటు చేయాలని తెలిపింది.
- Advertisement -