న్యూఢిల్లీ: తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పర్యటించనున్నారు. గుజరాత్, దీవ్ ప్రాంతాల్లో ప్రధాని పర్యటన కొనసాగనుంది. దేశంలోని పశ్చిమ తీరం మీదుగా తుఫాను వల్ల సంభవించిన నష్టాన్ని సమీక్షించడానికి ప్రధాని మోడీ గుజరాత్, దీవ్ ప్రాంతాల్లో సందర్శించనున్నారు. పిఎం మోడీ ఉదయం 9:30 గంటలకు ఢిల్లీ నుంచి భావ్‌నగర్‌లో దిగనున్నారు, అక్కడ నుంచి ఉనా, డియు, జఫరాబాద్, మహువా వైమానిక పర్యటన చేయనున్నారు. అనంతరం అహ్మదాబాద్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. దశాబ్దాల్లో ఈ ప్రాంతాన్ని తాకిన అతి పెద్దదని అధికారులు చెబుతున్నారు. గుజరాత్‌లో గంటకు 155-165 కిలోమీటర్ల వేగంతో గాలులు నిండి, 190 కి.మీ. తౌక్టే తుఫాను రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను దెబ్బతీసి, తీరం వెంబడి వినాశనానికి దారితీసింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు, అనేక ఇళ్ళు, రోడ్లను దెబ్బతీన్నాయి. తుఫాన్ బలహీనపడటానికి ముందు గుజరాత్ లో కనీసం ఏడుగురు మరణించారని అధికారులు మంగళవారం వెల్లడించారు. తుఫానులో 16,000 ఇళ్ళు దెబ్బతిన్నాయని, 40,000 కు పైగా చెట్లు, 1,000 స్తంభాలుధ్వంసం అయ్యాయని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చెప్పారు.
తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటన
- Advertisement -
- Advertisement -
- Advertisement -