Monday, December 23, 2024

ప్రధాని పర్యటన.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

PM Narendra Modi to visit Hyderabad

 

హైదరాబాద్: ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో గురువారం రానున్నారు. గ్రీన్‌ల్యాండ్స్, ప్రకాష్ నగర్ టీ జంక్షన్, రసూల్‌పుర టీ జంక్షన్, సిటిఓ జంక్షన్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. వాహనదారులు ఈ ప్రాంతాల్లో నుంచి రాకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రధానిని కలిసేందుకు వచ్చే వారు వారి వాహనాలను ఎయిర్ లైన్ కాలనీలో పార్కింగ్ చేయాలి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News