Sunday, December 22, 2024

తమ ఖజానా భర్తీపైనే కాంగ్రెస్, మిత్ర పక్షాల దృష్టి

- Advertisement -
- Advertisement -

2014కు ముందు వాటి లక్షం
అభివృద్ధి పథకాలు వారికి ప్రధానం కాదు
ఒడిశాలో ప్రధాని మోడీ ఆరోపణ

జైపూర్ (ఒడిశా) : కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు 2014కు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తమ ఖజానా నింపుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించాయని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఆరోపించారు. మోడీ జైపూర్‌లో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, ఒడిశా ‘వికసిత్ భారత్’కు స్వాగత ద్వారం (గేట్‌వే) కావాలని కేంద్ర ప్రభుత్వం వాంఛిస్తున్నదని చెప్పారు. ‘ఇప్పుడు చోటు చేసుకుంటున్న బృహత్ అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా జరిగి ఉండేవి కానీ 2014కు ముందు సంవత్సరాలలో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల దృష్టి అంతా తమ ఖజానా నింపుకోవడంపైనే ఉండేది’ అని ఆయన అన్నారు.

‘గడచిన పది సంవత్సరాలలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంఒడిశాలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఒడిశా వికసిత్ భారత్‌కు స్వాగత ద్వారం కావాలని కోరుకుంటున్నాం’ అని ప్రధాని తెలిపారు. నిరుపేదలకు ఒకప్పుడు కల అయిన శాశ్వత గృహం, కుళాయి నీరు, ఇంటిలో గ్యాస్ కనెక్షన్ ‘ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయి’ అని ప్రధాని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News