Thursday, January 23, 2025

అమెరికా కాంగ్రెస్‌లో కీలక ప్రసంగం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా చట్టసభల సంయుక్త సమావేశాన్ని ఉద్ధేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎల్లవేళలా పటిష్టంగా ఉండేందుకు అమెరికా కాంగ్రెస్ ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచిందని , ఈ నేపథ్యంలో తాను జాయింట్ సెషన్‌లో మాట్లాడనుండటం కీలకం అవుతుందని ప్రధాని వివరించారు. కేవలం ప్రభుత్వాలు అధికారిక వ్యవస్థల మధ్యనే కాకుండా ప్రజల మధ్య అనుబంధాలు దేశాల మధ్య స్నేహ వారధులను బిగుసుకునేలా చేస్తాయని తెలిపారు.

ఈ కోణంలో ఇరుదేశాల మధ్య వాడిపోని విశ్వాసం నెలకొంటుంది. భారత్ అమెరికా మధ్య ఇటువంటి పరిపూర్ణపు సహకారపు నమ్మకాల పయనం కేవలం ఇరుదేశాలకే కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రధాన విషయం అవుతుందన్నారు. ప్రవాస భారతీయులతో తాను ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించబోతున్నానని, ఇది తన మనస్సుకు బాగా ఆకట్టుకునే దశ అవుతుందని తెలిపారు. ఇండో అమెరికన్లు అమెరికాలో ఓ ప్రభావిత వర్గంగా ఉంది. ఈ శ్రేణులు మన అత్యున్నత విలువల సమాజాన్ని అక్కడ ప్రతిఫలిస్తున్నాయని, వారితో ముచ్చటించడం తనతో తానే మాట్లాడుకోవడం అవుతుందని అన్నారు.

తన పర్యటన దశలో కొందరు ప్రముఖ సంస్థల కార్యనిర్వాహక అధికారిక స్ధానాల్లోని సిఇఒలతో తాను జరిపే చర్చలు మేలు చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచానికి ఇప్పుడు సరఫరా వ్యవస్థ పటిష్టం కావడం అత్యవసరం. పెట్టుబడులు వ్యాపార వాణిజ్యాలను మరింత ఉన్నతికి తీసుకువెళ్లడం ప్రధాన ఘట్టం అవుతుంది. దీని ఫలితంగానే ప్రపంచస్థాయిలో పటిష్టం అయ్యే సరఫరా వలయం మరింత ధృఢమవుతుందన్నారు. ఇరు దేశాల ఉమ్మడివిలువలు అయిన ప్రజాస్వామ్యం, వైవిధ్యత, భిన్నత్వంలో ఏకత్వం, స్వేచ్చ వంటివి ఈ పర్యటన దశలో మరింత వెల్లివిరుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News