- Advertisement -
బెంగాల్: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య రోజుకో వివాదం రాజుకుంటూనే ఉంది. ఇటీవల యాస్ తుపాన్‌పై ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశానికి మమతతోపాటు సిఎస్ బందోపాధ్యాయ్ హాజరు కాకపోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మమతా కొవిడ్-19 వ్యాక్సినేషన్ ధృవపత్రాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోను తొలగించడంతో మరో వివాదానికి తెరలేపినట్లయింది. పశ్చిమ్ బెంగాల్ లో మూడోదశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 18-44 ఏళ్ల వారికి టీకాలు వేస్తున్నారు. వీరికి ఇచ్చే వ్యాక్సినేషన్ ధృవపత్రాలపై ప్రధాని మోడీ ఫొటోను తొలగించి, ఆ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటో ముద్రించారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్ ఘడ్ లో కూడా ఇటీవల వ్యాక్సినేషన్ ధృవపత్రాలపై ప్రధాని ఫొటోను తొలగించిన విషయం తెలిసిందే.
- Advertisement -