Saturday, November 23, 2024

ప్రధాని పోస్ట్ ఖాళీగా లేదు: షానవాజ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమైన నేపథ్యంలో బిజెపి నాయకుడు సయ్యద్ షానవాజ్ హుస్సైన్ సోమవారం స్పందించారు. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవి ఖాళీగా ఏమి లేదన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సోమవారం హౌరాలోని స్టేట్ సెక్రెటరియేట్ నబన్నాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుసుకున్నారు. ప్రతిపక్ష శక్తులను ఏకం చేయడానికి వారీ సమావేశం నిర్వహించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని దించేయాలన్నదే వారి ధ్యేయం. సమావేశానంతరం ‘బిజెపిని శూన్యానికి దించేయాలన్నదే తన అభిలాష’ అని మమతా బెనర్జీ ఈ సందర్భంగా అన్నారు.

దీనిపై స్పందించిన షానవాజుద్దీన్ ‘వారి స్వప్నం సాకారం కాదు. మూడోసారి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపికి ఢోకాలేదు’ అన్నారు. ‘నితీశ్ కుమార్ దేశానికి ప్రధాని కావాలని అనుకుంటున్నారు. కానీ బీహార్‌లోని ఎంఎల్‌ఏను లెక్కలోకి తీసుకుంటే ఆయన పార్టీ మూడో స్థానంలో ఉండనున్నది. ప్రధాని పోస్ట్ ఖాళీగా లేదని నితీశ్ కుమార్‌కు కూడా తెలుసు’ అన్నారు.

దీనికి ముందు నితీశ్ కుమార్ ఏప్రిల్ 12న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ఎంపీ రాహుల్ గాంధీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. సమావేశానంతరం రాహుల్ గాంధీ ‘ప్రతిపక్షాఐక్యత దృష్టా ఇదో చారిత్రక ముందడుగు. ప్రతిపక్షాలు బిజెపితో సైద్ధాంతికంగా పోరాడుతున్నాయి. ఇండియా కోసం మేము కలిసి పోరాడుతాం’ అన్నారు. ఆయన ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News