Saturday, December 21, 2024

విశ్వాస పరీక్షలో నెగ్గిన నేపాల్ ప్రధాని ‘ప్రచండ’

- Advertisement -
- Advertisement -

నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ బుధవారం పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో గెలిచారు. ప్రభుత్వాధినేతగా ఏడాది క్రితం తన మూడవ సంకీర్ణ ప్రభుత్వాన్ని ‘ప్రచండ’ ఏర్పాటు చేసిన తరువాత వారానికి ఈ విశ్వాస పరీక్ష జరిగింది. మాజీ మావోయిస్ట్ గెరిల్లా నేత అయిన దహల్ నేపాలీ కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీలతో కలసి నిరుడు సంకీర్ణ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. తనకు స్వేచ్ఛ ఇవ్వలేదని చెబుతూ ఆయన ఈ నెలలో మిత్ర పక్షాలను మార్చారు. కొత్త మంత్రివర్గంలో ఉదారవాద నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యుఎంఎల్)దే ఆధిపత్యం. పలు ఇతర చిన్న పార్టీలు కూడా మంత్రివర్గంలో ఉన్నాయి. దహల్ 2022 ఎన్నికల అనంతరం స్వల్ప కాలం యుఎంఎల్‌తో కలసి ఒక సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించారు.

275 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీకి 138 వోట్లు రావలసి ఉండగా దహల్ 157 వోట్లతో గెలిచారని, 110 మంది ఎంపిలు ఆయనకు వ్యతిరేకంగా వోటు వేశారని స్పీకర్ దేవ్ రాజ్ ఘిమిరె తెలియజేశారు. ‘నన్ను చాలా సార్లు వంచించారు& కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయక తప్పలేదు. ఇది అసలు మామూలు రాజకీయ ప్రక్రియ’అని దహల్ బుధవారం పార్లమెంట్‌లో చెప్పారు. నేపాలీ కాంగ్రెస్‌ను ప్రస్తావిస్తూ ఆయన ఆ మాటలు అన్నారు. నేపాలీ కాంగ్రెస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం. ఏమాత్రం ముందుగా చెప్పకుండా తమను తొలగించడం ద్వారా ప్రధాని మోసం చేశారని క్రితం వారం ఉద్వాసన అనంతరం నేపాలీ కాంగ్రెస్ ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News