Tuesday, November 5, 2024

కొవిడ్19 మూడో ఉధృతిపై.. రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష

- Advertisement -
- Advertisement -

PM review with Chief Ministers tomorrow over Covid 3rd wave

సాయంత్రం 4:30 నుంచి వీడియో కాన్ఫరెన్స్

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 మూడో ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగే ఈ సదస్సు సాయంత్రం 430కి మొదలవుతుందని అధికారికవర్గాలు తెలిపాయి. దేశంలో కొవిడ్‌వ్యాప్తి జరుగుతున్నతీరు, అడ్డుకట్ట వేయడంలో రాష్ట్రాలు చేపట్టిన చర్యలపై ప్రధాని సమీక్షించనున్నారు.

దేశంలో బుధవారం (24 గంటల్లో)రికార్డుస్థాయిలో 1,94,720 కేసులు, 442 మరణాలు నమోదయ్యాయి. దీంతో, యాక్టివ్ కేసుల సంఖ్య 9,55,329కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో ఇది 2.65 శాతం. దేశంలోకి ఒమిక్రాన్ ప్రవేశించిన అనంతరం మొదలైన మూడో ఉధృతి సమయంలో ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించే మొదటి సమావేశమిది. మొదటి, రెండో ఉధృతుల సందర్భంగా పలుమార్లు ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్షించిన విషయం తెలిసిందే.

ఆదివారం ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో దేశంలో కొవిడ్19 ఉధృతిపై సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ను విస్తృతంగా చేపట్టాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. జిల్లాస్థాయి వరకూ ఆరోగ్య వసతుల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. త్వరలోనే రాష్ట్రాలవారీగా పరిస్థితిని అంచనా వేయడానికి ముఖ్యమంత్రులతో సమావేశం ఆవశ్యకతను ప్రధాని గుర్తు చేశారు. ఈలోగా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నతీరుతో తక్షణమే సమావేశం నిర్వహించాలని భావించినట్టుగా తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News