న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చైనా విషయంలో తన సాహస వైఖరిని కనబరచలేదని ఆల్ ఇండియా మజ్లీస్‌ఎఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం అభిప్రాయపడ్డారు. “ప్రధాని రాజకీయ నాయకత్వాన్ని ప్రదర్శించడంలో విఫలమయ్యారు. డిసెంబర్ 9న జరిగిన ఘర్షణపై మాత్రమే మీరు ప్రకటన చేస్తున్నారు. ఒకవేళ మీడియా ఆ ఘర్షణ గురించి తెలుపకుంటే ప్రధాని ఆ విషయాన్ని అసలు ప్రస్తావించేకారు” అని అసదుద్దీన్ విమర్శించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని పార్టీల వారిని కేంద్ర ప్రభుత్వం విశ్వాసంలోకి తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. అసలు చైనా పేరెత్తడానికి సైతం ప్రధాని, కేంద్ర ప్రభుత్వం భయంతో కంపించిపోతున్నారని అన్నారు.
“15 రౌండ్ల చర్చల్లో మీరేం చేశారు? ఘర్షణ జరిగిన ప్రదేశానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి చూయించండి. చైనా పేరెత్తడానికి, చైనాపై మాట్లాడేందుకు మీకంత భయమైతే ఎట్లా ప్రధానిగారు” అని అసదుద్దీన్ విమర్శించారు.
చైనా పేరెత్తాలంటేనే ప్రధానికి భయం: అసదుద్దీన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -