Monday, January 20, 2025

మాట తప్పినందుకు ప్రధాని క్షమాపణ చెప్పాలి: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలకు మంత్రి కెటిఆర్ శ్రీకారం చూట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ… రేపట్నుంచి పోడు భూముల లబ్ధిదారులకు రైతుబంధు వస్తుందన్నారు. ప్రమాదం జరిగి రైతు చనిపోతే రైతు బీమా వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Also Read: బాలాసోర్ ప్రమాదం: 29 మృతదేహాల గుర్తింపు పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా 4.06 లక్షల ఎకరాల ద్వారా 1.51 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందన్న ఆయన పోడు భూములకు పట్టాలు మాత్రమే కాదు.. రైతు బంధు, రైతు బీమా కూడా అందుతుందన్నారు. ములుగు లో 360 ఎకరాల భూమి ఇచ్చినా గిరిజన వర్సిటీ ఏమైందని ప్రధాని మోడీని అడుగుతున్నా..? ప్రధాని వరంగల్ వచ్చినప్పుడు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఉక్కుకర్మాగారం ఇస్తామన్నారు… ఏమైందన్నారు. ఇచ్చిన మాట తప్పినందుకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News