Thursday, December 19, 2024

ప్రపంచ సమస్యలపై బైడెన్‌తో చర్చించా…

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆత్మయ స్వాగతానికి ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. 140 కోట్ల భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. అమెరికాలోని 4 మిలియన్ల ఎన్ఆర్ఐలకు గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. 3 దశాబ్ధాల క్రితం సామాన్యుడిగా అమెరికా పర్యటనకు వచ్చానని వెల్లడించారు.

నాడు వైట్ హౌస్ ను బయటి నుంచి చూశానన్న ఆయన ప్రధాని అయ్యాక పలుమార్లు అమెరికా పర్యటనకు వచ్చానని చెప్పుకొచ్చారు. పెద్దఎత్తున జన నీరాజనాలతో తొలిసారి వైట్ హౌస్ ద్వారాలు తెరుచుకున్నాయన్నారు. అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నారని మోడీ స్పష్టం చేశారు. భారతీయులు తమ నిబద్ధత, నైపుణ్యంతో దేశ గౌరవాన్ని పెంపొందిచారని ప్రధాని ప్రశంసించారు.

ఇరుదేశాల వ్యవస్థలు, సంస్థలు ప్రజాస్వామ్య పునాదులపై ఆధాపడి ఉన్నాయన్నారు. ప్రజా ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా ఇరుదేశాలు పనిచేస్తున్నాయని సూచించారు. కోవిడ్ విపత్తు వేళ ప్రపంచం కొత్త రూపు సంతరించుకుందని ఆయన వెల్లడించారు. ఇరుదేశాలల స్నేహం విశ్వ సామర్థ్యాన్ని పెంపేందుకు దోహదం చేసిందన్నారు. ప్రపంచ ఆహారం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేసేందుకు కంకణబద్ధులై ఉన్నాయన్నారు.

ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ సౌభాగ్యం కోసం కలిసి పనిచేసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. ప్రపంచ శాంతి, సామరస్యం, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఇరుదేశాల సంబంధాలు, ప్రపంచ సమస్యలపై బైడెన్ తో చర్చించామని సూచించారు. బైడెన్ తో చర్చలు సానుకూల దృక్పథంతో సాగాయన్నారు. రెండు దేశాల పతాకాలు ఎప్పటికీ సరికొత్త శిఖరాలను చేరాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News