- Advertisement -
అఖిలపక్ష సర్కారుకు వీలు?
కొలంబో : తాను రాజీనామాకు సిద్ధమని శ్రీలంక ప్రధాని విక్రమసింఘే ప్రకటించారు. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు తాను సుముఖం అని, అవసరం అనుకుంటే రాజీనామా చేస్తానని శనివారం వెల్లడించిన సింఘే తరువాత రాజీనామా చేసినట్లు వెల్లడైంది. దేశాధ్యక్షుడి పరారుకు ముందు ఆయన రాజీనామా వ్యాఖ్యలకు దిగారా? లేక ముందుగా ఈ స్పందన వెలువరించారా? అనేది వెల్లడికాలేదు. వారంరోజులలో పరిస్థితి చక్కబడుతుందని, ఆహార ధాన్యాలు అందుతాయని, ఐఎంఎఫ్ స్పందిస్తుందని, ఇంధన నిల్వలు దండిగా ఉంటాయని ప్రధాని తెలిపారు. అయితే ప్రతిపక్షాలు కోరుతున్నట్లు అఖిలపక్షంతోనే అంతా బాటుంటుందనుకుంటే రాజీనామాకు సిద్ధమని ఆయన తెలిపినట్లు ప్రధాని మీడియా విభాగం శనివారం ఓ ప్రకటన వెలువరించింది. దేశ భద్రత, జనం క్షేమం సంక్షేమం కీలకం. ఇందుకు ఆయన ఏదైనా చేస్తారని స్పందించింది.
- Advertisement -