Friday, November 22, 2024

పాలనుకుని సారా తాగుతారు..90 ఎంఎల్ శాచెట్లు వద్దు

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్(తస్మాక్) కొత్తగా ప్రవేశపెట్టిన 90 ఎంఎల్ లిక్కర్ శాచెట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ప్రారంభిస్తామని పాట్టాలి మక్కళ్ కట్చి(పిఎంకె) హెచ్చరించింది. పిఎంకె రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి అన్బుమణి రాందాస్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ అనుభవజ్ఞుడైన రాష్ట్రా ఎక్సైజ్ శాఖ మంత్రి ముత్తుసామి నుంచి ఇటువంటి చర్యను తాను ఊహించలేదని అన్నారు. విద్యార్థులు, యువతపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

90 ఎంఎల్ శాచెట్లలో మద్యం అమ్మకాల వల్ల రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. విద్యార్థులు, మైనర్లు ఆకర్షనీయంగా ప్యాక్ చేసే ఈ శ్యాచెట్లను చూసి పాలు అనుకుని మద్యం తాగే ప్రమాదం ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 70, అంతకన్నా తక్కువ ఉండే అ మద్యం శాచెట్లతో రాష్ట్రంలో మద్యంపై ప్రజలు మక్కువ పెంచుకుంటారని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

1989, 2002లో కూడా 100 ఎంఎల్ మద్యం శాచెట్లను ప్రమేశపెట్టినపుడు తాము తీవ్రంగా ఆందోళన చేశామని, ప్రభుత్వం వాటి అమ్మకాలను ఉపసంహరించుకున్నదని ఆయన గుర్తు చేశారు. మద్యం అమ్మకాలు తగ్గాలంటే రాష్ట్రంలో లిక్కర్ షాకులను సంపూర్ణంగా మూతవేయడం ఒక్కటే మార్గమని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News