న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత, విద్యుద్ సమస్యలపై మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం( పిఎంఓ) సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలో బొగ్గు నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై కేంద్ర విద్యుత్ కార్యదర్శి అలోక్ కుమార్, బొగ్గు కార్యదర్శి ఎకె జైన్‌లు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బొగ్గు రవాణా పెంచడానికి మార్గాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, అంతర్జాతీయ ధరల కారణంగానే బొగ్గు కొరత ఏర్పడిందని అధికారులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినందున బొగ్గు ఉత్పత్తిని పెంచామని అధికారులు వివరించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతను అధిగమించడానికి కేంద్రం గత రెండు మూడు రోజులుగా పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. బొగ్గు సరఫరాను పెంచాలని బొగ్గు మంత్రిత్వ శాఖను ఆదేశించగా, మరో వైపు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వద్దకు బొగ్గు రవాణా కోసం అవసరమైనన్ని రేక్‌లను అందుబాటులో ఉంచాలని రైల్వే శాఖను ఆదేశించడం జరిగింది.
బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై పిఎంఓ సమీక్ష
- Advertisement -
- Advertisement -
- Advertisement -