Monday, December 23, 2024

పేదలకు అండగా పిఎంఆర్ ట్రస్టు సేవలు

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్సీ, జడ్పీ చైర్‌పర్సన్ తనయుడు రినీష్‌రెడ్డి

తాండూరు: పేదలకు అండగా పిఎంఆర్ ట్రస్టు సేవలు అందిస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ సునితారెడ్డిల తనయుడు రినీష్‌రెడ్డి అన్నారు. సోమవారం తాండూరులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎంఆర్ ట్రస్టు ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సేవా కార్యాక్రమాలు కొనసాగిస్తామని అన్నారు.

అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న పరిమల్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ శోభరాణి, నీరజబాల్‌రెడ్డి, రాము, రవి, సంజీవ్‌రావు, రాములు, రాజుపటేల్, యాదవ్, వెంకట్‌రెడ్డి, బి.రఘు, తాండ్ర రాకేష్, సిద్దు, కోట్ల రాజ్‌కుమార్‌రెడ్డి, జగదీష్, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News