Monday, December 23, 2024

పిఎంఆర్ ట్రస్టు సేవలకు రాజకీయాలతో సంబంధం లేదు

- Advertisement -
- Advertisement -
  • రినీష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు
  • సెప్టెంబరులో సామూహిక వివాహాలు జరిపిస్తాం
  • ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడి

తాండూరు: పిఎంఆర్ ట్రస్టు ఆద్వర్యంలో చేస్తున్న సేవా కా ర్యక్రమాలకు రాజకీయాలతో సంబంధం లేదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం రినీష్‌రెడ్డి ఆద్వర్యంలో తాం డూరులో భారీగా బైక్‌ర్యాలీ నిర్వహించారు. పిఎంఆర్ క్రికెట్ టోర్నీ నియోజక వర్గం విజేతలకు అవార్డులు, ప్రైజ్‌మనీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు రినీష్‌రెడ్డి రాజకీయాలు చేయడం లేదని, యువతకు ఉద్యోగ కల్పన కల్పించడంతోపాటు వారికి అన్ని విధాల చేయూత అందిస్తున్నాడని అన్నారు.

రాబోయే రోజుల్లో ఇంకా అనేక ఆటపోటీ లు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబరు, అక్టోబర్‌లో భారీ స్థాయిలో సామూహిక వివాహాలు పిఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాండూరులో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నీ నిర్వహించినట్లు గుర్తు చేశారు. తమ కుటుంబానికి క్రీడలంటే మక్కువని, అందుకే తమ సోదరుడు రాజేందర్‌రెడ్డి పేరున కూడా అనేక టోర్నమెంట్లు నిర్వహించి యువతను క్రీడల్లో ప్రోత్సహించినట్లు చెప్పారు. పట్నం రినీష్‌రెడ్డి మాట్లాడుతూ యువతరమే దేశానికి వెన్నముక అని అన్నారు.

యువతను అన్ని రంగాలలో రాణించేలా ప్రోత్సహిస్తామని అన్నారు. రాబోయే కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. యువత మత్తుకు బానిస కావొద్దని హితవు పలికారు. కొందరు నాయకులు యువతను డ్రగ్స్‌కు అలవాటు చేస్తు వారి జీవితాలతో అడుకుంటున్నారని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా మౌలిక వసతుల మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, తాండూరు మున్సిపల్ చైర్‌ఫర్సన్ స్వప్న పరిమల్, డిసిసిబి మాజీ ఛైర్మన్ లకా్ష్మరెడ్డి, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్‌కు మార్, అబ్దుల్ రవూఫ్, గాజీపూరు నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అజయ్‌ప్రసా ద్, సిద్రాల శ్రీనివాస్, కౌన్సిలర్లు శోభారాణి, నీరజాబాల్‌రెడ్డి, పట్లోళ్లనర్సింలు, బాల్‌రెడ్డి, రఘు, దత్తు, యువత తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు అవార్డులు, ప్రైజ్‌మని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News