- నేడు 6వేల మంది యువతతో భారీ బైక్ ర్యాలీ
- ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి
తాండూరు: గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు పిఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాండూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
మంగళవారం తాండూరు పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బుధవారం తాండూర్‌లో 6 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలంలో క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన జట్లకు నేడు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో బహుమతులను ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో యువతను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ బైక్ ర్యాలీ ఇలియామున్ చౌరస్తా నుండి ప్రారంభమై ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముగుస్తుందన్నారు. పిఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంటులో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. పీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో 225 జట్లు, 3వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు అన్నారు. నియోజవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో పెద్దెముల్ జట్టు మొదటి స్థానం బషీరాబాద్ జట్టు రెండో స్థానం నిలిచాయన్నారు. వీరికి మొదటి బహుమతి రెండు లక్షలు రెండో బహుమతి లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.