- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ చేసిన ప్రకటనలు మరో ఎన్నికల జుమ్లాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం లాగే ఈ ప్రకటనలు కూడా ఎప్పటికీ నెరవేరుతాయో ఎవరికీ తెలియదని విమర్శించారు. ఎన్నికలు రావడంతో ఓట్ల కోసమే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ,అలాగే గతంలో సాధ్యం కాదని చెప్పిన పసుపు బోర్డు కూడా పెడతామని ప్రధాని బూటకపు ప్రకటనలు చేశారని విమర్శించారు. పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను దాదాపు పదేళ్లు అవుతున్న అమలు చేయని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మబోరని, ఎన్ని మాయ మాటలు చెప్పినా బిజెపికి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయబోరని స్పష్టం చేశారు.
- Advertisement -