గాంధీనగర్: ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత ప్రధాని మోడీ సంయుక్తంగా శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. వారి మధ్యలో ఉక్రెయిన్ యుద్ధం ముగింపు, వాతావరణ, ఇంధన భాగస్వామ్యం, ఇండోపసిఫిక్ ప్రాంతాన్ని ‘ఫ్రీ అండ్ ఓపెన్’గా ఉంచాలన్న విషయాలపై, అలాగే రోడ్ మ్యాప్ 2030పై కూడా చర్చ జరిగింది. బోరిస్ జాన్సన్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గుజరాత్ చేరారు. వారిరువురు రెండు దేశాల కొత్త రక్షణ ఒప్పందంపై కూడా సంతకాలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఫ్రీ ట్రేడ్ డీల్‌ను ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనుకుంటున్నారు. భారత్ స్వంతంగా ఫైటర్ జెట్స్ తయారుచేసుకోడానికి బ్రిటన్ సాయపడుతుందని ఈ సందర్భంగా బోరిస్ తెలిపారు. కాగా బోరిస్ జాన్సన్ చాలా పాత మిత్రుడు. ఆయన ప్రధానిగా ఎన్నికయ్యాక భారత్ పర్యటించడం ఇదే మొదటిసారని మోడీ అన్నారు. ఆయన భారత్‌ను బాగా అర్థం చేసుకుంటారన్నారు. ఇండోపసిఫిక్ ప్రాంతంలో ఓపెన్, ఇన్‌క్లూజివ్, రూల్ బేస్డ్ ఆర్డర్ ఉండాలని మేము బలంగా కోరుకుంటున్నామని మోడీ తెలిపారు. రష్యాఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చలు జరగాలని మేము బలంగా కోరుకున్నామని కూడా మోడీ తెలిపారు.
బోరిస్ జాన్సన్, మోడీ సంయుక్త పత్రికా సమావేశం
- Advertisement -
- Advertisement -
- Advertisement -