Monday, December 23, 2024

ఘనంగా పిఎన్‌బి ‘వినియోగదారుల హక్కుల దినోత్సవం’

- Advertisement -
- Advertisement -

PNB celebrates Consumer Rights Day

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 15న వినియోగదారుల హక్కులు, సార్వభౌమాధికారానికి గుర్తుగా జరుపుకుంటారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి) ఎండి, సిఇఒ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల అధ్యక్షతన కార్పొరేట్ కార్యాలయంలో బ్యాంక్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. బ్యాంక్ సిజిఎం ఆపరేషన్స్, గౌరీ ప్రసాద్ శర్మ ఈ వేడుకను ప్రారంభించారు. ఆ తర్వాత పిఎన్‌బి ఎండి, సిఇఒ అతుల్ కుమార్ గోయెల్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు అందుబాటులో ఉండడం ద్వారా వారికి సరైన కస్టమర్ సేవలను అందివ్వాలని అన్నారు. బ్యాంక్ తన కస్టమర్ల విభిన్న ఆర్థిక అవసరాలను తీర్చడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో వారి ప్రయోజనాలను ఎల్లప్పుడూ రక్షించడానికి కట్టుబడి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News