Tuesday, April 15, 2025

రూ.13,500 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్టు అయ్యారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధృవీకరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో పరారీలో ఉన్న 65 ఏళ్ల వ్యక్తిని భారత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అభ్యర్థన మేరకు శనివారం(ఏప్రిల్ 12) బెల్జియం  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ప్రస్తుతం బెల్జియన్ జైలులో ఉన్నాడు.

అధికార వర్గాల ప్రకారం.. చోక్సీ బెల్జియం పౌరసత్వం కలిగిన తన భార్య ప్రీతి చోక్సీతో కలిసి బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో నివసిస్తున్నాడు. క్యాన్సర్ చికిత్స నెపంతో ఆంటిగ్వా నుండి బెల్జియంకు ప్రయాణించాడని తెలుస్తోంది. స్విట్జర్లాండ్‌కు పారిపోవాలని ప్రయత్నిస్తున్న క్రమంలో బెల్జియం పోలీసులు చోక్సీని అదుపులోకి తీసుకున్నారు. కాగా, 13,500 కోట్ల రూపాయల కుంభకోణంలో చోక్సీ కీలక నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. తన మేనల్లుడు నీరవ్ మోడీతో కలిసి, ఈ మోసానికి కుట్ర పన్నాడని, మోసపూరిత అండర్‌టేకింగ్ లెటర్‌లను ఉపయోగించి ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకు నుండి భారీ మొత్తాలను స్వాహా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతను విదేశాలకు పారిపోయాడు. ఈ కుంభకోణంలో చోక్సీపై CBI, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లు కేసు నమోదు చేసి అతన్ని ఇండియాకు రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భారత్ అభ్యర్థన మేరకు బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News