మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో నేటి నుంచి న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శర్మణ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో డిఎంహెచ్‌ఓ వెంకటితో కలిసి మాట్లాడుతూ 6వారాల వయస్సున్న పిల్లలకు మొదటిడోసు, 14వారాలకు రెండ డోసు, 9 నెలలకు మూడవ డోసు ఇవ్వస్తామని, దీనితో న్యూమోనియాను అరికట్టవచ్చన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఈవ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ప్రభుత్వం నేటి నుంచి వైద్యఆరోగ్యశాఖ ద్వారా దేశవ్యాప్తంగా వేస్తున్నట్లు చెప్పారు.
ఈవ్యాక్సిన్ ఒక డోసు ఖరీదు రూ. 4వేలు ఉంటుందని వైద్యాధికారి వెంకటి తెలిపారు. కోవిడ్ థర్డ్‌వేవ్ పొంచి ఉన్న తరుణంలో పిల్లలకు తప్పనిసరిగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయించాలన్నారు. ప్రధానంగా పోషకాహర లోపంతో బాధపడే పిల్లలకు వ్యాధి నిరోదక శ క్తి తక్కువగా ఉంటుందని, అటువంటి పిల్లలో న్యూమోనియా ప్రబలే అవకాశాలు, మరణాలు ఎక్కువని అటువంటి పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. దీనితో న్యూమోనియా, సెప్టిసేమియా మెనెంజైటిస్, అర్టైంటిస్, సైనోసైటిస్ వ్యాధులను నిర్మూలింవచ్చన్నారు.ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో ఆరు వారాల నిండిన పిల్లలందరికి బుధ, శనివారాలలో ఈవ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ఈవ్యాక్సిన్ చాలా సురక్షితమైనదని చెప్పారు. ఈకార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీకళా పాల్గొన్నారు.