Saturday, December 21, 2024

మళ్లీ అదే గోప్యత

- Advertisement -
- Advertisement -

పిల్లల్లో వ్యాపిస్తున్న అంతు చిక్కని న్యూమోనియాపై పెదవి విప్పని చైనా

రోజుకు సుమారు 1,200 చిన్నారులు జ్వరాలతో
తల్లడిల్లుతూ ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి
కరోనా తగ్గిపోయింది అనుకుంటున్నా తరుణంలో తాజాగా చైనాలో తీవ్ర పరిణామాలు
ప్రపంచానికి చైనా పూర్తి వివరాలు అందించాలంటూ…fever and chest pain
ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసిన ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అనుకుంటున్నా తరుణంలో, తాజాగా చైనాలో పరిణామాలు గమనిస్తున్న ప్రపంచ వివిధ దేశాల్లో ఉన్న వైద్యులు రానున్న విపత్తును అంచనా వేయడంలో నిమగ్నులయ్యారు. వైద్యులకు, శాస్త్రవేత్తలకు అంతుచిక్కని విధంగా చైనాలో పిల్లలకి సోకుతున్న జ్వరాల విషయంలో ప్రపంచాన్ని మరొకసారి ఆందోళనలోకి నెట్టి వేస్తున్నది.

రోజుకు సుమారు 1,200 చిన్నారులు జ్వరాలతో తల్లడిల్లుతూ, ఆసుపత్రుల పాలవుతున్నారని, ఇది పరిస్థితి ఎంత విషమించిందో అద్దం పట్టినట్లుగా తెలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జ్వరాలకు సంబంధించి వ్యాధి లక్షణాలు, వ్యాధి వ్యాప్తి చెందిన విధానం, వ్యాధిని తగ్గించే చికిత్స విధానంపై, వివిధ సమాచారాలు సేకరిస్తున్న పల్మనాలజిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ జర్నలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. ప్రపంచానికి చైనా పూర్తి వివరాలు అందించవలసిన అవసరం ఉందని, ఆలస్యం చేయకుండా, రక్త, మూత్ర పరీక్ష, ఇతరత్రా పరీక్షల వివరాలు వెల్లడించాలని, పిల్లల ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రిలో వివరాలు చెప్పాలని డాక్టర్ వ్యాకరణం తన లేఖలో డబ్లూహెచ్‌ఒను కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి పరిస్థితుల్లో, అలసత్వ వైఖరి చూపించకుండా, వెంటనే చైనా ప్రభుత్వాన్ని చైనాలో పెట్రేగుతున్న రోగం గురించి అడిగి తెలుసుకుని యావత్ ప్రపంచానికి సమాచారం అందించాలని డాక్టర్ వ్యాకరణం తెలిపారు.

మూడేళ్ల క్రితం చైనా ఇదే పద్దతి అవలంభించింది
చైనా ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం ఇదే పద్ధతి అవలంభించిందని, చివరకు ప్రపంచం అల్లకల్లోలం అయిందని వాపోయారు. ఎక్కడికక్కడ ఆరోగ్య వ్యవస్థ స్తంభించి పోయిందని, పెద్దలు మొదలుకుని చిన్న పిల్లల వరకు కొన్ని లక్షల సంఖ్యలో మరణించారని ఆందోళనవ్యక్తం చేశారు. ఇవన్నీ మరవకముందే మళ్లీ చైనాలో ఈ జ్వరాలు పేట్రేగడం, చైనా ప్రభుత్వం నిశ్శబ్దం, ఇవన్నీ గమనిస్తే రానున్న ముప్పు ఏ విధంగా ఉండబోతుందో అనే ఆందోళన ప్రతి ఒక్క వైద్యుల్లో ఉందని డాక్టర్ వ్యాకరణం వెల్లడించారు. ఇప్పుడు పిల్లల్లో విపరీతంగా ముదురుతున్న జ్వరాలకు కారణం మైకోప్లాస్మా, రెస్పిరేటరీ సెన్సిసిఎల్ వైరస్, ఇన్‌ఫ్లుయెంజా లేదా కరోనా వేరియంట్ ఇన్ఫెక్షన్లు అనే విషయంపై చైనా ఆరోగ్య సంస్థ నుండి ఇంకా స్పష్టత రాలేదని, ఈ విషయంపై ఆరోగ్య సంస్థ పలు దఫాలుగా చైనా ఆరోగ్య శాఖను ప్రశ్నిస్తున్నామని -డాక్టర్ వ్యాకరణం అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మీడియా సెల్ ఈమెయిల్ ద్వారా సమాధానం చెప్పింది. దీనికి సంబంధించి కొన్ని కీలకమైన లింక్స్ కూడా డాక్టర్ వ్యాకరణంకు డబ్లూహెచ్‌ఒ పంపించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News