Monday, April 21, 2025

పోచం కన్నయ్యకు పద్మశాలి సేవారత్న అవార్డు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీకి చెందిన పోచం కన్నయ్య పద్మశాలీ సేవా రత్న అవార్డు అందుకున్నారు. ఆదివారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ చేతుల మీదుగా పోచం కన్నయ్య పద్మశాలీ సేవారత్న అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభల ప్రెసిడెంట్ రమా సత్యనారాయణ హ్యూమన్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ కొంపెల్లి సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో అవార్డు అందుకున్నారు.

ఈ సందర్బంగా పోచం కన్నయ్య మాట్లాడుతూ…. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ప్రతినిధులకు, యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మోత్కూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పోచం బిక్షపతి, ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పాశికంటి శ్రీనివాస్, మోత్కూర్ పట్టణ పద్మశాలి, చేనేత కార్మికులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News