Monday, December 23, 2024

వైభవంగా పరిగిలో పోచమ్మ బోనాల ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

పరిగి: పట్టణంలోని బహార్‌పేట్ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత రెండు రోజులుగా పరిగిలో ఆదివారం మైసమ్మతల్లి బోనాలు జరుపుకున్నారు. అనంతరం సోమవారం పోచమ్మ దేవాలయం బోనాలు ప్రతి ఏటా జరుపుకునే విధంగా భక్తులు అత్యంత భక్తి భావాలతో ఆనందోత్సవాల మద్య జరుపుకున్నారు.

బోనాలతో మహిళలు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా రేగింపుతో ర్యాలీగా, పోతురాజుల విన్యాసాలతో ఒకరి వెంట ఒకరూ చూడ ముచ్చటగా బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. దేవాయలం చుట్టూ ఐదు ప్రదక్షణలు చేసి నైవేధ్యాలను అమ్మవారికి సమరించారు. కొందరూ మొక్కులు ఉన్న వారు బోనాలతో పాటు, కోళ్లను అమ్మవారి గుడి మందు కోశారు. ఉదయం నుంచే అమ్మవారికి దర్శనానికి భక్తులు పోటేత్తారు.

బోనాల ఉత్సవాలలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల అనీల్‌రెడ్డి, జడ్‌పిటిసి హారిప్రియా ప్రవీణ్‌రెడ్డి, ఎంపిపి కరణం అరవింద్‌రావు, మార్కెట్ కమిటి ఛైర్మన్ సురేందర్, సోసైటీ వైస్ ఛైర్మన్ భాస్కర్, మాజీ ఎంపిటిసి ఆనేం నర్సిములు, మండల పార్టీ అధ్యక్షులు ఆర్.ఆంజనేయులు, కౌన్సిలర్‌లు ఎదిరే కృష్ణ, వేముల కిరణ్, వారాల రవీందర్, వెంకటేష్, ముకుంద శేఖర్, సభ్యులు పాండు, నితీన్, జ్యోతి, బలాల, ఆయా పార్టీల నాయకులు తదితరులు ఉత్సవాలలో పాల్గొని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News