Thursday, January 23, 2025

అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు

- Advertisement -
- Advertisement -

బెజ్జంకి: మండల పరిధిలోని వడ్లూరు గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని సర్పంచ్ నాలువల అనిత తెలిపారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం నూతనంగా ప్రతిష్ఠించనున్న పోచమ్మ తల్లి, పోతరాజు, నాగదేవతల విగ్రహాలను గ్రామ పుర వీదుల్లో శోభాయాత్ర నిర్వహించగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం ప్రతిష్ఠ విగ్రహాలకు అభిషేకాలు దాన్యదివాసం, హోమాలు, చేసిన అనంతరం మహిళలచే సామూహిక కుంకుమార్చనలు వేద పండితులు తంగళ్లపల్లి సంపత్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

కుంకుమార్చనలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. గ్రామం పాడిపంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే గొప్ప సంకల్పంతో సర్పంచ్ నాలువల అనిత తన సొంత ఖర్చులతో పోచమ్మతల్లి నూతన ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని గ్రామస్థులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాలువల స్వామి, గ్రామ పంచాయతీ పాలక వర్గం, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News