Sunday, December 22, 2024

జలకళను సంతరించుకున్న పోచంపాడ్ ప్రాజెక్టు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : ఈ యేడాది వానాకాలం సీజన్‌కు సంబంధించి జూలై రెండవ వారం వచ్చిన ఉత్తర తెలంగాణ వరప్రధాయినిగా ఉన్న పోచంపాడ్ ప్రాజెక్టు నీటిమట్టం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గోదావరి ఎగువన మహారాష్ట్రలో బాబ్లీ గేట్లు ఎత్తినప్పటికీ నామమా త్రంగానే ఇన్‌ప్లో నమోదు అయ్యింది. నిజానికి మహారాష్ట్రలో భారీ వర్షాలు పడితేనే ప్రతియేటా పోచాంపాడ్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది.

కానీ ఈయేడాది ఎగువ కురిసే వర్షాలపై ఆశలు వదులుకున్న ప్రభుత్వం రివర్స్ పంపింగ్ పోచంపాడ్ ప్రాజెక్టును నీటిని ఎత్తిపోసింది. కాలేశ్వరం నుంచి గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టులకు గత పది రోజుల్లోనే దాదాపు 30 టిఎంసిల మేరకు నీటిని పోచంపాడ్ ప్రాజెక్టుకు తరలించింది. నిజానికి పోచంపాడ్ దిగువ ఆయకట్టుకు సాగునీటి అవసరాలకు ప్రాజెక్టులు 40 టిఎంసిల మేరకు నీటి నిల్వ ఉంటే సరిపోతుంది. ఈనేపథ్యంలోనే అధికారులు 30 టిఎంసిలు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్‌తో తరలించారు. కానీ గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో రివర్స్‌పంపింగ్ ప్రక్రియను సోమవారం నిలిపివేశారు. రాబోయే రోజుల్లో ఎగువ నుంచి కనీసం 10 టిఎంసిల నీటిని ప్రాజెక్టులో వచ్చే చేరే అవకాశం ఉందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. మొత్తానికి వానాకాలం సీజన్‌కు సంబంధించి పోచంపాడ్ ఆయకట్టు రైతులకు సాగునీటి రద్దీ లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News