Friday, January 3, 2025

ఫిలిప్పీన్స్ లో పోచంపల్లి వైద్య విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి మండలంలోని రామలింగంపల్లి గ్రామానికి చెందిన గూడూరు రామ్‌రెడ్డిరాధా దంపతుల కుమారుడు మణికాంత్ రెడ్డి(21) ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబిబిఎస్ చదువుతూ శనివారం మృతి చెందాడు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం ఫిలిప్పీన్స్ దేశంలో దావోదు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సెకండియర్ చదవడానికి గత సంవత్సరం ఆగస్టులో ఇండియా నుండి బయలుదేరి వెళ్ళాడు. కాగ మణికాంత్ రెడ్డి గత రాత్రి శనివారం అక్కడ భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రాత్రి 11 గంటల సమయంలో హాస్టల్ మెట్ల పైనుండి జారిపడి తలకు తీవ్ర గాయమై చనిపోయినట్లు ఆదివారం తల్లిదండ్రులకు కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది.

కాగ మణికాంత్ రెడ్డి రాత్రి సమయంలో హాస్టల్ మెట్ల పైనుండి జారిపడి తలకు తీవ్ర గాయమై చనిపోయి మురికి కాలువలో పడి ఉన్నాడని కొందరు, బైక్ యాక్సిడెంట్ అయ్యి తలకు గాయమై మురికి కాలువలో పడి చనిపోయడని, అనుమానస్పద మృతితో చనిపోయి ఉన్నాడని తల్లిదండ్రులకు సమాచారం అందిస్తున్నారు. కాగ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెంది కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ను కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News