Monday, December 23, 2024

బాన్సువాడలో నామినేషన్ దాఖలు చేసిన పోచారం

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ/బీర్కూర్: బాన్సువాడ పట్టణంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనకు ఎన్నికల సమయంలో ప్రతిసారి సెంటిమెంట్ కలిసి వచ్చే 7007 నెంబర్ గల అంబాసిడర్ వాహనంలో వెళ్లి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులంటే బాధ్యతల గల వారని, తమపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తారని, బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందన్నారు.

అనంతరం బీర్కూర్ మండలంలో ప్రచారం షురూ చేశారు. మండలంలోని తిమ్మాపూర్, బీర్కూర్ తాండ, కిష్టాపూర్, చించొల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సిఎం కెసిఆర్ సహకారంతో, మరోసారి బరిలో నిలిచానని ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు రాంబాబు, పుల్లెన్ బాబురావు, మాజీ జడ్పీటీసీద్రోణవల్లి సతీష్, జడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్, ఎంపీపీ రఘు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News