Monday, December 23, 2024

డబుల్ బెడ్ రూమ్ చెక్కుల పంపిణీ చేసిన పోచారం సురేందర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

నిజామాబాద్: జిల్లాలోని రుద్రూర్ మండల కేంద్రంలోని కొందపూర్ గ్రామంలో మంగళవారం టిఆర్‌ఎస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్ రూం లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాన్సువాడ నియోజక వర్గంలోని అంబం ఆర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కొందపూర్ గ్రామం అంటే తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంతో ఇష్టమన్నారు. గ్రామంలో సుమారు 30 డబుల్ బెడ్ రూమ్‌లు మంజూరు చేయగా 15 మంది లబ్దిదారులు ఇల్లు కట్టకున్న వారికి మొదటి విడత బిల్లులను పంపిణీ చేశారు.

బాన్సువాడ నియోజక వర్గంలో పదివేల డబుల్ బెడ్ రూంలు మంజూరు చేసిన ఘనత స్పీకర్ పోచారందేనని వెల్లడించారు. ఈకార్యక్రమంలో జడ్పీటిసి నరోజి గంగారాం, ఎంపిపి అక్కపల్లి సుజాత నాగేందర్, టిఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షులు పత్తి లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ కోర్వ భాగ్య భూషణ్, హౌసింగ్ ఏఈ నాగేశ్వర్‌రావు, గ్రామ ఉప సర్పంచ్ గణేష్ శ్యామ్, రాయకూర్ ఎంపిటిసి అనిల్ పటేల్, రాయకూర్ సర్పంచ్ గైని గంగారాం, మండల రైతు సమన్వయ అధ్యక్షులు తోట సంగయ్య, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సంజీవులు, సోషల్ మీడియా మండల కన్వీనర్ లాల్ మహ్మద్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మంత్రి గంగారాం, పట్టేపు రాములు జక్రి, నరేందర్, శానం హనుమాన్లు, మాజీ విండో అధ్యక్షులు పత్తి రాము గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News