ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ పోకో తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. అదే POCO M6 Pro 5G. ఇది తక్కువ ధరలో అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. కాగా, ఈ ఫోన్ జూన్ 9 న లాంచ్ చేయబడింది. అయితే, ఈ
ఫోన్ ను మళ్ళీ 8 GB RAM, 256 స్టోరేజ్ ఆప్షన్‌లతో కొత్తగా రిలీజ్ చేశారు. దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ ధర, స్పెసిఫికేషన్లు ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
ధర
ధర గురించి మాట్లాడితే..ఈ POCO ఫోన్ 6 GB RAM వేరియంట్ ధర $ 129 (దాదాపు రూ. 10,700) గా తీసుకొచ్చారు. అయితే, 8 GB RAM వేరియంట్ ధర $ 149 (సుమారు రూ. 12,400) గా నిర్ణయించారు. ఈ ఫోన్ నలుపు, సిల్వర్ , పర్పుల్ రంగులలో విడుదల చేశారు. బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తున్న ఈ ఫోన్ లో చాలా ఫీచర్లు ఉన్నాయి.
ఫీచర్లు
ఈ Poco ఫోన్‌లో 6.79 అంగుళాల FHD+ IPS LCD ప్యానెల్ డిస్‌ప్లేను పొందుపరిచారు. కాగా, ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. దీనితో పాటు గరిష్ట ప్రకాశం స్థాయి 550 నిట్‌లు. DC డిమ్మింగ్ ఫీచర్‌తో పాటు..వెనుక ప్యానెల్ గ్లాస్ కూడా ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఇక మెరుగైన పనితీరు కోసం..MediaTek Helio G91 అల్ట్రా చిప్‌సెట్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ 6GB, 8GB LPDDR4X RAM మరియు 128GB, 256GB నిల్వతో వస్తుంది. ఫోన్‌లో హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ ఉంది.
ఇక కెమెరా విషయానికి వస్తే..ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108MP ప్రైమరీ కెమెరా + 2MP సెకండరీ కెమెరా ఉంది. అయితే, ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా అమర్చారు. చివరగా బ్యాటరీ గురించి చెప్పాలంటే..ఇది 5,030mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనితో పాటు ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.