Sunday, December 22, 2024

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దారుణం

- Advertisement -
- Advertisement -

సమాజంలో బాధ్యత కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తున్న రక్షకభట అధికారి ఓ బాలికపై అత్యాచారం యత్నం చేసిన ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, కాజీపేట పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి..ఈస్ట్ జోన్‌లో వరంగల్ నగరానికి ఆనుకుని ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఇన్స్‌స్పెక్టర్‌గా కొంతకాలం క్రితం పనిచేసి, ప్రస్తుతం ఐజి కార్యాలయానికి అటాచ్మెంట్‌లో ఉన్న సిఐ రవికుమార్ ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి వడ్డేపల్లి ప్రాంతంలోని కెయుసి 100 ఫీట్ల రోడ్డును ఆనుకుని ఉన్న ఒక అపార్ట్మెంట్‌లో నివాసం ఉంటున్న ఆ సిఐ ఇంట్లో ఎవరూ లేని

సమయంలో బాలికపై అత్యచారయత్నం చేయగా ఆమె తప్పించుకుని వెళ్లి తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రుల సహాయంతో కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు సిఐ రవికుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కాగా, నిందితుడైన సిఐ గతంలో సెంట్రల్ జోన్ పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్‌లోనూ కొంతకాలం సిఐగా బాధ్యతలు నిర్వహించాడు. ఈ సంఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News