Monday, July 8, 2024

వైసిపి మాజీ ఎంఎల్ఎ సుధాకర్‌పై పోక్సో కేసు

- Advertisement -
- Advertisement -

వైసిపి నేత, కోడుమూరు మాజీ ఎంఎల్‌ఎ జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తన ఇంట్లో పనిచేసే బాలికపై లైంగిక్ వేధింపులకు పాల్ప్డ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా గురువారం కర్నూలు లోని నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంత్రం సుధాకర్‌ను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. జరదొడ్డి సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి.

దీనికి సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు సుధాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు. ఇదిలాఉంటే సుధాకర్ 2019 ఎన్నికల్లో వైసిపి తరపున కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే, 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్‌కు టికెట్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News