Monday, December 23, 2024

కన్నోజ్ ఘటనలో వ్యక్తిపై పోక్సో కేసు

- Advertisement -
- Advertisement -

POCSO case against man in Kannoj incident

కన్నోజ్(యుపి): ఒక ప్రభుత్వ అతిథి గృహం ప్రాంగణంలో రక్తసిక్త గాయాలతో ఒక 12 ఏళ్ల బాలిక ఇటీవల లభించగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఒక వ్యక్తిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలలో లభించిన ఒక వీడియో ఆధారంగా ఆ వ్యక్తిపై మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన ఆ బాలికను అతిథి గృహం నుంచి ఆటోకు నడిపించుకుని ఒక పోలీసు అధికారి తీసుకువెళుతుండగా అక్కడి స్థానికులు తమ సెల్‌ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ఆదివారం రక్తసిక్త గాయాలతో ఉన్న ఆ బాలికను చూసిన అతిథిగృహం వాచ్‌మెన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ బాలిక బంధువు ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సోతోసహా ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు గుర్తించారని, అతడిని అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకున్నామ్నజ్ ఎస్‌పి కున్వర్ అనుపమ్ సింగ్ బుధవారం తెలిపారు. ఆ బాలిక చికిత్స కోసం రోజుకు రూ. 1 లక్ష ఖర్చు అవుతుందని, ఆ బాలిక తండ్రి కేవలం రూ. 2.5 లక్షలు జమచేశారని ఎస్‌పి చెప్పారు. స్థానికుల సాయంతో రూ. 7 లక్షలు సేకరించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News